Advertisement
Google Ads BL

జీవితంలో సంతోషం లేదు: రజినీకాంత్


బాబా చిత్రం చేసినప్పటినుండి సూపర్ స్టార్ రజినీకాంత్ ఎక్కువగా హిలమాలయాలకు వెళ్లడం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. హిమాలయాలకు వెళ్లి కొన్నాళ్ళు అక్కడే ఉండి.. మళ్ళీ మానసిక ప్రశాంతతతో ఉల్లాసంగా రజిని సినిమా షూటింగ్స్ లో పాల్గొనేవారు. తాజాగా చెన్నై లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రజినీకాంత్ తనకి నటుడిగా బాబా, రాఘవేంద్ర సినిమాలు మాత్రం ఆత్మ సంతృప్తిని ఇచ్చాయని కామెంట్స్ చేసారు. ఆ సినిమాల తర్వాత ఆ ఇద్దరి సద్గురుల గురించి చాలామందికి తెలిసింది అంటున్నారు రజిని. అంతేకాకుండా ఆ రెండు సినిమాలు చూసిన నా అభిమానుల్లో ఇద్దరు సన్యాసం కూడా తీసుకున్నారు. కానీ నేను మాత్రం ఇంకా హీరోగానే సినిమాలు చేస్తున్నాను.

Advertisement
CJ Advs

హిమాలయాలంటే అక్కడ మంచు మాత్రమే ఉండదు. అక్కడ ఎన్నో అద్భుతమైన వనమూలికలు దొరుకుతాయి, అవి గనక తింటే వారానికి సరిపోయే శక్తి లభిస్తుంది. హెల్త్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. మనం గనక అనారోగ్యానికి గురైతే మనకి కావాల్సిన వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. నేను జీవితంలో ఎన్నో చూసాను, ఎంతో డబ్బు సంపాదించాను. కానీ సిద్దులలో ఉండే మానసిక ప్రశాంతత అనేది నాలో ఓ పది శాతం కూడా లేదు అంటూ సన్యాసం పై రజినీకాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Rajinikanth sensational comments on his career:

Rajinikanth sensational comments on his career he did not get happiness 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs