జబర్దస్త్ జీవితానికి అనసూయ గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. రెండు నెలల క్రితమే అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెబుతూ ఎమోషనల్ గా జబర్దస్త్ పై ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది. దానితో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెబుతూ స్టార్ మా లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది అని అన్నారు. కానీ తనకి సినిమా ఆఫర్స్ వలనే జబర్దస్త్ చెయ్యలేకపోతున్నా అంటుంది అనసూయ. ఇక ఈ మధ్యన జబర్దస్త్ లో అవమానం జరగబట్టే అనసూయ, సుధీర్ లాంటి పాపులర్ క్రేజీ స్టార్స్ జబర్దస్త్ ని వదిలి బయటికి వచ్చారంటూ ఆర్పీ నానా రచ్చ చేసాడు. అయితే వచ్చే గురువారం ఎపిసోడ్ లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పెయ్యబోతుంది. అనసూయ మీద తాగుబోతు రమేష్ స్కిట్ చేసాడు. దానితో అనసూయ, ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు.
అనసూయ ని ఉద్దేశించి తాగుబోతు రమేష్ టీం డైలాగ్స్ రాసుకున్నారు. వెంకీ మంకీ తాగుబోతు రమేష్ అనసూయ గెటప్ లో ఉండగా.. మీరు చిన్న పిల్లలు ఉన్నప్పుడే తల్లితండ్రులకి ఇచ్చి జబర్దస్త్ ని మేనేజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అన్నాడు. దానికి అనసూయ గెటప్ లో ఉన్న తాగుబోతు రమేష్ జబర్దస్త్ అనేది పర్మినెంట్ సర్.. ఇక్కడికి చాలామంది వస్తుంటారు, వెళ్లిపోతుంటారు. కానీ జబర్దస్త్ స్టిల్ రన్నింగ్ అంటూ ఎమోషనల్ గా డైలాగ్ చెప్పాడు. అనసూయ స్టేజ్ మీదకి రాగానే.. అనసూయ మీరు నెలలో మూడు రోజులు మా కోసం అడ్జెస్ట్ లేకపోతున్నారా.. అంటూ నిలదీసాడు. దానితో అనసూయ అలా చూస్తూ ఉంది. కానీ జెడ్జ్ ఇంద్రజ మాత్రం కన్నీటి పర్యంతమైంది.