Advertisement
Google Ads BL

మెగాస్టార్‌ చిరుకి షాకిస్తుందట..!


మెగాస్టార్ చిరంజీవికి ఓ తార ఇప్పుడు షాకివ్వబోతుంది. ఆ తార మరెవరో కాదు.. వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ మధ్య కాలంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎటువంటి పాత్రలను చేస్తుందో చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు తను చేసిన పాత్రలు కానీ, ప్రస్తుతం తను సైన్ చేసిన చిత్రాల వరసను చూస్తుంటే.. ముందు ముందు వరాలుకి తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాసోహం అవడం ఖాయమని అనిపిస్తుంది. విషయంలోకి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మెగా154’ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా.. ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆమె పాత్ర.. చిరు పాత్రకి షాక్ ఇచ్చేలా ఉంటుందని, ఆమె పాత్రని దర్శకుడు పవర్ ఫుల్‌గా చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ వంటి హీరోకి వరలక్ష్మీ పోటీగా నిలబడటం అంటే మాములు విషయం కాదు. నిజంగా ఆమె పాత్ర పవర్ ఫుల్‌గా పండితే మాత్రం.. ఇకపై టాలీవుడ్‌లో ఆమెకి తిరుగుండనేది మాత్రం సత్యం. 

Advertisement
CJ Advs

 

ఇదిలా ఉంటే, మరోవైపు వరలక్ష్మీ శరత్ కుమార్.. నందమూరి నటసింహం బాలయ్య చిత్రంలో కూడా ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. ‘NBK107’ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. గోపీచంద్ దర్శకత్వంలో అంతకుముందు వచ్చిన ‘క్రాక్’ చిత్రంలో వరలక్ష్మీ ఎటువంటి పవర్ ఫుల్ పాత్రలో నటించిందో తెలిసిందే. ఆ పాత్రకి తగ్గకుండా.. ఈ చిత్రంలో కూడా తన పాత్ర ఉంటుందనేలా ఇప్పటికే టాక్ వచ్చింది. ఇందులో కూడా ఆమె నెగిటివ్ రోల్‌నే చేస్తున్నట్లుగా టాక్. సో.. అటు చిరంజీవి, ఇటు బాలయ్య.. ఈ ఇద్దరి చిత్రాలలో ఆమె పాత్రకి సంబంధించి వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే.. టాలీవుడ్‌కి లేడీ విలన్‌గా వరలక్ష్మీ కొన్నాళ్ల పాటు చక్రం తిప్పడం ఖాయం అని మాత్రం తెలుస్తుంది. 

Mega 154: Chiranjeevi to experience female firepower:

<span>Varalakshmi Sarath Kumar plays powerful role in Mega154</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs