నాలుగైదు రోజులుగా సింగర్ శ్రావణ భార్గవికి అటు అన్నమయ్య వంశీకులు, ఇటు కొంతమంది విమర్శకులు చుక్కలు చూపిస్తున్నారు. కొన్నిరోజులుగా శ్రావణ భార్గవి ఆమె భర్త సింగర్ హేమ చంద్ర విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారానికి శ్రావణ భార్గవి ఒకపరి కొకపరి వయ్యారమై కాంట్రవర్సీ వీడియో కీర్తన అడ్డుకట్ట వేసింది. ఎంతో భక్తిదాయకమైన అన్నమయ్య కీర్తనను వెకిలి చేష్టలతో చిత్రీకరించి మరీ వీడియో రిలీజ్ చేసిందని అన్నమయ్య వంశస్తులు, కొంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు శ్రావణ భార్గవిపై మండిపడ్డారు. అన్నమయ్య వంశస్తులు ఏకంగా కోర్టుకు కూడా వెళ్తామని శ్రావణ భార్గవిని హెచ్చరించారు.
కానీ శ్రావణ భార్గవి మాత్రం తాను చేసిన వీడియో లో ఎలాంటి తప్పు లేదని వాదించడమే కాకుండా.. అది మీ చూపులోనే ఉందని, దుప్పటి కప్పుకున్నా అది అశ్లీలంగానే కనిపిస్తుంది అంటూ ఘాటుగా స్పందించింది. ఆ వీడియోని డిలేట్ చెయ్యమని అన్నమయ్య వంశస్తులు డిమాండ్ చేస్తుండగా.. ఆమె మాత్రం ఆ వీడియో తీసేదే లేదు అంటూ పట్టుబట్టుకుని కూర్చుంది. దానితో శ్రావణ భార్గవిని తిరుపతిలో కాలు పెట్టనిచ్చేది లేదు అంటూ తిరుపతి ప్రజలు ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో శ్రావణ భార్గవి దిగొచ్చింది. శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానల్ నుండి ఒకపరి కొకపరి వయ్యారమై వీడియో ని డిలేట్ చేసింది. ఆ వీడియో డిలేట్ చెయ్యడంతో అన్నమయ్య వంశస్తులు ఆనందిస్తున్నారు.