Advertisement
Google Ads BL

అందుకే హిట్‌2 లేటయ్యింది


నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా హిట్. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్న హిట్ సినిమా నానికి మంచి హిట్ నిచ్చింది. ఇక హిట్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2 లో ఈసారి హీరో మారాడు. ఈసారి హిట్ 2 కి అడివి శేష్ వచ్చాడు. రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ఫుల్‌ సినిమా మేజర్‌ (మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌)తో ఆడియన్స్ ని మెప్పించిన అడివి శేష్‌ త్వరలోనే హిట్‌2తో సిద్ధమవుతున్నారు. జులై 29న విడుదల ఉంటుందని ఇంతకు ముందు ప్రకటించినా ఇప్పటిదాకా ప్రమోషన్సే మొదలు కాలేదు.

Advertisement
CJ Advs

దీని గురించి అడివి శేష్‌ మాట్లాడుతూ మేజర్‌ రిలీజ్‌ కాగానే హిట్‌2 షూటింగ్‌లో పాల్గొనాలి. ఆఖరి షెడ్యూల్‌ని పూర్తి చేయాలి. కానీ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్‌ ని ప్రపంచంలోని నలుమూలలా ఉన్న ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాను. శారీరకంగా, మానసికంగా అత్యంత సంతృప్తినిచ్చిన క్షణాలు ఆస్వాదించాను. ఆ విషయాలను నానికి,  శైలేష్‌కి వివరించాను. ఫైనల్‌ షెడ్యూల్‌ని అతి త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పాను. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. చివరి షెడ్యూల్‌ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెడతాం. హిట్‌2 రిలీజ్‌ గురించి అతి త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేస్తాం అని అన్నారు.

సెకండ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌, హిట్‌2లో అడివి శేష్‌ కృష్ణదేవ్‌ అనే కేరక్టర్‌ చేస్తున్నారు. అందరూ కృష్ణదేవ్‌ని కేడీ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కథగా చూపిస్తారు.

సెకండ్‌ పార్ట్ ఆఫ్‌ హిట్‌ (హొమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌)ని ప్రముఖ స్టైలిస్ట్ ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్నారు. నాని సమర్పిస్తున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై రూపొందిస్తున్నారు. Dr. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

Hit2 enters the final schedule:

Adivi Sesh to resume Hit2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs