Advertisement
Google Ads BL

భర్త మరణం తర్వాత మీనా ఫస్ట్ టైం అలా


మీనా భర్త విద్యా సాగర్ రీసెంట్ గా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో కన్ను మూసిన విషయం తెలిసిందే. మీనా భర్త మరణం పావురాల రెట్టల వలన సంభవించింది అంటూ మీడియాలో ఓ న్యూస్ స్ప్రెడ్ అవడంతో మీనా భర్త మరణించిన తర్వాతి రోజే.. ఓ వీడియోతో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చెయ్యొద్దు అంటూ వేడుకుంది. అయితే భర్త అంత్యక్రియలను మీనా, ఆమె కూతురు దగ్గరుండి నిర్వహించారు. భర్త మరణం తర్వాత మీనా కొద్ది రోజుల గ్యాప్ తో తాను నటిస్తున్న సినిమా షూటింగ్స్ లో జాయిన్ అయ్యింది. టాలీవుడ్ లో ఎస్. వి కృష్ణ రెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు లో నటిస్తుంది,.

Advertisement
CJ Advs

అయితే మీనా షూటింగ్ స్పాట్ లో ఉండడం చూసిన అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో చేసింది. మీనా దగ్గరకి వెళ్లి.. మీనా నువ్వు నేను ఎప్పుడు కలిశామో తెలుసా.. అంటూ పెళ్ళాం చెబితే వినాలి సినిమా టైం లో నేను 7th క్లాస్ చదువుతున్నా అని, అప్పుడు ఎగ్జామ్స్ ఎగ్గొట్టి నిన్ను కలిసాను అని, ఆ పిక్ చూపించడంతో మీనా కూడా తాను చాలా రోజుల తరువాత టాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. ఒకటి రెండు సినిమాల్లో ఆఫర్లు వచ్చినా చేయలేదని.. అయితే ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో తొలిసారి నటిస్తున్నానని.. ఈ మూవీ సెట్‌లో ఉంటే అసలు షూటింగ్ జరుగుతున్నట్లే అనిపించడం లేదని.. ఎంతో సరదాగా సాగుతుంది అంటూ చెప్పుకొచ్చింది మీనా.

Ali wife revealed the photo of Meena after her husband death:

Ali spouse revealed the photograph of Meena after husband death
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs