చైతు తో డివోర్స్ తీసుకుని సపరేట్ అయిన సమంత సోషల్ మీడియా పోస్ట్ లు చూసిన అక్కినేని ఫాన్స్ చిందులు తొక్కిన విషయం తెలిసిందే. నాగ చైతన్య తో డివోర్స్ విషయంలో తప్పంతా సమంత దే అన్నట్టుగా అక్కినేని ఫాన్స్ ప్రవర్తించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ నెటిజెన్స్ సమంత చేసే పోస్ట్ లు చూసి చైతూ కామ్ గా డీసెంట్ గా ఉంటే.. ఆమె మాత్రం ఇలాంటి పోస్ట్ లు పెడుతూ విడాకులతో తానొక్కటే బాధపడినట్లుగా చేసింది అంటూ ఫైర్ అయ్యారు. అయితే తాజాగా సమంత పై అక్కినేని ఫాన్స్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సమంత ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగానే చైతు తో విడాకుల విషయాన్ని ప్రస్తావించింది.
కానీ ఫస్ట్ టైం నేషనల్ మీడియా(కరణ్ షో) ని వేదికగా చేసుకుని చైతూ పై ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేసింది. తాను భరణం తీసుకోలేదు అని, భర్త కాదు, మాజీ భర్త అని, మేము పారదర్శకంగా విడాకులు తీసుకోలేదు, ఒకే గదిలో ఉంటే కొట్టుకు చస్తాం అంటూ క్లారిటీ ఇచ్చింది. కనీసం చైతు పేరు కూడా ఎత్తలేదు. నాగ చైతన్య మాత్రం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మీకు ఏ హీరోయిన్ తో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అని ఓ యాంకర్ అడిగితే సామ్, సాయి పల్లవి, సామ్ తో ఎక్కువగా లవ్ స్టోరీస్ చేశాను, సామ్ తో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అన్నాడు. నాగ చైతన్య హుందాగా సామ్ అని పిలిస్తే.. సమంత మాత్రం చైతు పేరు ఎత్తకుండా డిఫెండ్ చేసుకుంది అంటూ అక్కినేని ఫాన్స్ సమంత ఫై గరంగరంగా ఉన్నారు.