షో రేటింగ్స్ పెంచుకోవడానికి టివి ఛానల్స్ యాజమాన్యం ఏం చేయడానికైనా ఈమధ్యన వెనుకాడడం లేదు. గతంలో జబర్దస్త్ లో స్టేజ్ పై గొడవలు పడినట్లుగా ప్రోమో లో చూపించేవారు. ఆ గొడవంతా క్రేజ్ కోసమే అన్నట్టుగా ఎపిసోడ్ లో చూపించేవారు. ఇక సుమ క్యాష్ ప్రోగ్రాం లోనూ జబర్దస్త్ నరేష్ పైనుండి కిందపడిపోగా.. అంబులెన్సు వచ్చినట్టుగా ప్రోమో రెడీ చేసి వదిలారు. కానీ నరేష్ దూకను లేదు, అంబులెన్సు రానూ లేదు. జస్ట్ బుల్లితెర ప్రేక్షకులు వెర్రివాళ్ళు అయ్యారు అంతే. ఇప్పుడు ప్రముఖ డాన్స్ షో ఢీ లోను ఇలాంటిదే ఒకటి జరిగింది. గణేష్ మాస్టర్, శ్రద్ద దాస్, నందిత శ్వేత లు జెడ్జెస్ గా వచ్చే ఎపిసోడ్ లో ఓ డాన్స్ మాస్టర్ - శ్రద్ద కపూర్ ఢీ డాన్స్ షో స్టేజ్ పై గొడవ పడిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యింది.
శ్రద్ద దాస్ వేరే టీమ్ తో డాన్స్ చెయ్యడం నచ్చని ఓ డాన్స్ మాస్టర్.. మా టీం కూడా బాగా చేసింది అలా పార్షియలిటీ చూపించడం నచ్చలేదు అంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. యాంకర్ ప్రదీప్ అడ్డు వచ్చినా.. నువ్వు ఒదరకు భయ్యా అంటూ ఆ డాన్స్ మాస్టర్ వినలేదు, ఆది ఏదో అనబోతుంటే ఈ జోక్స్ అన్నీ నా మీద వెయ్యకు అస్సలు మంచిగుండదు చేబుతున్న అన్నాడు. ఈలోపులో శ్రద్ద దాస్ కన్నీళ్లు పెట్టుకుంటూ కోపంతో స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. జేడ్జ్ స్థానంలో కూర్చున్నాక కూడా శ్రద్ద దాస్ కన్నీళ్లు పెడుతున్న ప్రోమో వైరల్ అవ్వగా.. ఇదంతా కావాలనే చేసారు. ఇది ప్రాంక్ ప్రోమో, అందులో ఎలాంటి నిజం లేదు, జస్ట్ రేటింగ్ పెంచుకోవడానికి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.