అనసూయ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి హాట్ యాంకర్ గా ఓ కొత్త ఒరవడి సృష్టించింది. సుమ సోలో గా తన హవా కొనసాగిస్తున్న టైం లోనే యాంకరింగ్ కి గ్లామర్ ని పరిచయం చేసిన అనసూయ.. జబర్దస్త్ షో తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ షో కి వచ్చేటప్పటికి అనసూయ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అందాలు ఆరబోసే విషయంలో అనసూయ ఎప్పుడూ తగ్గేది కాదు. అయితే అనసూయ వయసు పై ఎంతో మందికి ఎన్నో అనుమానాలున్నాయి. ఇప్పుడు అనసూయ తన వయసుని డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా జబర్దస్త్ షో లో బయటపెట్టేసింది.
గత రాత్రి అనసూయ జబర్దస్త్ స్టేజ్ పై లవ్ స్టోరీస్ లో భాగంగా తనకి 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే భరద్వాజ్ తనపై కచ్చిఫ్ వేసాడు అని, తర్వాత మూడేళ్ళకి పెళ్లి సంబంధాలు వస్తే.. ఆ సంబంధాలు చెడగొట్టేందుకు ప్రయత్నాలు చేశాను అని, తన తండ్రి ఆరేళ్ళ కి తమ ప్రేమని ఒప్పుకున్నారని, ప్రేమలో ఉన్న తొమ్మిదేళ్లకి భరద్వాజ్ ని వివాహం చేసుకున్నాను అని, మా పెళ్ళై ఇప్పటివరకు 11 ఏళ్ళు అయ్యింది, 20 ఏళ్లగా భరద్వాజ్ తనని భరిస్తున్నాడు అంటూ.. 16+09+11 అలా కాలిక్యులేట్ చేస్తే.. అనసూయకి 36 ఏళ్ళ వయసు. అలా అనసూయ వయసు బయటకి వచ్చేసింది.