నాగ చైతన్య గతంలో మలయాళంలో హిట్ అయిన ప్రేమమ్ మూవీని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసాడు. ఆ సినిమాలో నాగ చైతన్య స్కూల్ లవ్, కాలేజ్ లవ్, మెచ్యూరిటీ లవ్ అంటూ అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్ లతో ప్రేమ లో పడ్డాడు. అనుపమ తో స్కూల్ డేస్ లో లవ్, శృతి హాసన్ లెక్చరర్ అయినా.. ఆమెతో ప్రేమాయణం, తర్వాత హోటల్ బిజినెస్ లో సెటిల్ అయ్యాక సెబాస్టియన్ తో లైఫ్ ని పంచుకోవడం చేసాడు చైతు. కాలేజ్ లో ఫైట్స్ అన్ని ఇప్పుడు ప్రేమమ్ మాదిరిగానే థాంక్యూ లో కూడా కనిపిస్తుంది
అంటే ఇక్కడ థాంక్యూ లో నాగ చైతన్య యంగ్ బాయ్ గా మాళవిక నాయర్ ని ప్రేమించడం, కాలేజ్ డేస్ లో అవికా గోర్ తో రాఖి కట్టించుకోవడం, కాలేజ్ ఫైట్స్, బిజినెస్ మ్యాన్ గా రాశి ఖన్నా ని ప్రేమించడం ఇలా అన్ని ప్రేమమ్ ని చూస్తున్నట్టుగా ఉన్నాయి అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చైతు - విక్రమ్ కుమార్ కలయికలో తెరకెక్కిన థాంక్యూ రేపు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మరి థాంక్యూ ఎలా ఉండబోతుంది, ప్రేమమ్ ని పోలి ఉంటుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.