విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ సెలెబ్రేషన్స్ మొదలైపోయాయి. ఇప్పటికే ఓ రొమాంటిక్ సాంగ్ తో రౌడీ ఫాన్స్ నే కాదు, నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న లైగర్ టీం ఇప్పుడు ఐదు భాషల ట్రైలర్ తో హడావిడి మొదలు పెట్టింది. తెలుగులో ప్రభాస్, చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ రిలీజ్ చెయ్యగా.. హిందీలో రణవీర్ సింగ్ లైగర్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్, విజయ్ దేవరకొండ మాస్ లుక్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. రమ్య కృష్ణ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలయ్యింది. తన కొడుకుకు లైగర్ పేరు పెట్టడానికి గల కారణం నా కొడుకు సంకరజాతి, సింహం మరియు పులికి జన్మించాడు క్రాస్ బ్రీడ్ సార్ వాడు అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ అదిరిపోయింది.
చాయ్‌వాలా బాక్సర్ గా ఎదిగిన ప్రయాణం, ఇండియా కి ప్రాతినిధ్యం వహించడానికి మరియు MMA టైటిల్‌ను గెలవడానికి ఎంతగా కష్టపడ్డాడో అనేది ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాధ్. నేను ఫైటర్‌ని అని విజయ్ చెప్పినప్పుడు, మైక్ టైసన్ నువ్వు ఫైటర్ అయితే, నేను ఏమిటి అంటూ క్రూరంగా కనిపించిన టైసన్ లుక్, డైలాగ్ ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ ఇదివరకెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. క్యారెక్టర్‌కి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తీసుకొచ్చిన విజయ్ దేవరకొండ మాస్ లుక్స్ మరియు పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. చాయ్ వాలా తల్లిగా రమ్య కృష్ణ తన నటనతో , లుక్స్ తో అదరగొట్టేసింది. అనన్య పాండే ట్రెండీ పాత్రలో కనిపించగా, ఇందులో రోనిత్ రాయ్ కోచ్‌గా కనిపించారు.
టెక్నికల్‌గా ట్రైలర్ సాలిడ్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ మరియు సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ గా రిచ్ గా కనిపిస్తుంది.