Advertisement
Google Ads BL

చై-సామ్ డివోర్స్: మురళీ మోహన్ షాకింగ్ కామెంట్స్


నాగ చైతన్య - సమంత గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుని సపరేట్ అయ్యారు. నాలుగేళ్ళ వివాహ బంధానికి చై - సామ్ డివోర్స్ తో స్వస్తి చెప్పారు. వారిద్దరూ విడాకులు తీసుకున్నామని ప్రకటించగానే అటు సినీ ప్రముఖులు, ఇటు అక్కినేని ఫాన్స్, అలాగే సాధారణ సినీప్రియులు కూడా చాలా ఫీల్ అయ్యారు. తాజాగా సమంత-నాగ చైతన్య డివోర్స్ పై సీనియర్ నటులు మురళీ మోహన్ షాకింగ్ కామెంట్స్ చేసారు. మురళీ మోహన్ అపార్ట్మెంట్స్ లో పై ఫ్లోర్ లో తన ఫ్యామిలీ కోసం మూడు ఇళ్ళు కట్టించుకోగా.. ఆ ఇంటిని చూసి మోజుపడిన నాగ చైతన్య మురళీ మోహన్ ని ఓ ఇల్లు అడగగా.. ఆయన నేను ఇవి మా ఫ్యామిలీ కోసం కట్టించుకున్నాను అని చెప్పారట. దానితో చై తండ్రి నాగార్జున తీసుకెళ్లి మురళీ మోహన్ తో మాట్లాడించి మరీ ఇల్లు తీసుకున్నాడట. ఆ తర్వాత చైతు ఒక్కడే ఆ ఇంట్లో ఉండేవాడని, పెళ్లి చేసుకున్నాక సమంత కూడా అదే ఇంట్లో ఉన్నట్లుగా మురళీ మోహన్ చెప్పారు.

Advertisement
CJ Advs

వాళ్ళు ఇద్దరూ చాలా అన్యోన్యంగా కలిసి వాకింగ్ చెయ్యడం, జిమ్ చెయ్యడం చేసేవారు. నాతోనూ సరదాగా ఉండేవారు. తర్వాత వాళ్ళు ఇల్లు కొనుక్కుని.. అది బాగు చేయించుకున్నాక ఆ ఇంట్లోకి మారుదామనుకున్నారు. కానీ అంతలోనే వారు విడాకులు తీసేసుకున్నారు. అసలు వాళ్లు విడిపోతున్నారన్న విషయం నాకన్నా ముందు పనిమనిషులకే తెలిసింది. ఎప్పుడూ గొడవ పడని వారు విడిపోతున్నారంటే బాధ అనిపించింది. ముందే తెలిసి ఉంటే నాగార్జున తో మాట్లాడి వారిని కలపడానికి ట్రై చేసేవాడిని, కానీ చై-సామ్ అప్పటికే విడాకుల నిర్ణయం తీసేసుకున్నారు అంటూ మురళీ మోహన్ చైతు డివోర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు.

Murali Mohan Shocking comments on Samantha - Naga Chaitanya divorce:

Murali Mohan Comments On Samantha - Naga Chaitanya Divorce
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs