Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ కి అనారోగ్యం


పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్ వాయిదా పడిన తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. రైతుల ఆత్మహత్యలకు నిరసనగా పవన్ కళ్యాణ్ ఊరూరూ తిరుగుతూ కొంతమంది రైతు కుటుంబాలకు తన వంతు సాయం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆషాఢమాసం లో చాతుర్మాస దీక్ష కూడా తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండడం, పవన్ కళ్యాణ్ వర్షంలో తడవడం కారణంగా ఆయనకి కొద్దిపాటి జ్వరం రాగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా సమాచారం.

Advertisement
CJ Advs

అంతేకాకుండా.. జనసేన అధ్యక్షుడిగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఓ అభిమాని పవన్ కళ్యాణ్ మీద పడిపోగా పవన్ కి వెన్ను నొప్పి స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత కూడా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనగా.. ఇప్పుడు ఆ వెన్ను నొప్పి ఎక్కువవడం, అలాగే జ్వరం కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారట. పవన్ కి అనారోగ్యం అని తెలియగానే జనసేన కార్యకర్తలు, పవన్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. 

The reason behind Pawan sudden illness:

Pawan fell sick again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs