సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా టాప్ లిస్ట్ లోకి చేరిన కొరటాల కి ఇప్పుడు ఆచార్య వ్యవహారం ఊపిరి ఆడనివ్వడం లేదు. ఆచార్య కొరటాల కెరీర్ లో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలవడం కొరటాలకి భారీ దెబ్బ. ఈ డైరెక్టర్ గత సినిమాలు సక్సెస్ అవడం, చరణ్ - చిరు కాంబో కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ వెనుకాముందు ఆలోచించకుండా ఆచార్య ని కొనేసి చేతులు కాల్చుకున్నారు. నష్టాలపాలయిన డిస్ట్రిబ్యూటర్స్ అంతా కొరటాల మీద పడ్డారు. చిరు - చరణ్ లు 20 కోట్లు సెటిల్ చేసారని అన్నప్పటికీ.. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్స్ కొరటాల ఆఫీస్ ముందు గొడవ చేసి 4.5 కోట్లు పట్టుకుపోయారు.
హమ్మయ్య కొరటాల ఊపిరి పీల్చుకుంటున్నారు అనుకోగానే.. ఇప్పుడు శాటిలైట్ డీల్ విషయంలో కొరటాల కి షాక్ ఇవ్వడానికి సదరు సంస్థ రెడీ అయ్యింది అంటున్నారు. జెమిని ఛానల్ ఆచార్య కి శాటిలైట్ హక్కుల్ని 15 కోట్లకు కొనుక్కుంది. కానీ ఇప్పుడు ఆచార్య విషయంలో జెమినీ వారు కొరటాల కి కండిషన్స్ పెడుతున్నారట. అంటే ఆ డీల్ రద్దు చేసి రేట్ తగ్గించి మరో అగ్రిమెంట్ రాసుకుందామని, లేదు అంటే మొదటి డీల్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేసుకుందామని కొరటాలకి కండిషన్ పెట్టారని తెలుస్తుంది. దానితో కొరటాల కి ఏం చెయ్యాలో అర్ధం కాకా తలపట్టుకున్నారంటూ ప్రచారం షురూ అయ్యింది.