Advertisement
Google Ads BL

వావ్: పుష్ప 3 కూడా..


పుష్ప అంటూ అల్లు అర్జున్-సుకుమార్ సినిమాని మొదలు పెట్టి అది పాన్ ఇండియాలోకి తీసుకువెళదామని ప్లాన్ చేసాక.. పుష్ప కాస్తా పుష్ప ద రైజ్, పుష్ప ద రూల్ గా రెండు పార్టులు గా సినిమాని రెడీ చేయబోతున్నట్లుగా ఎనౌన్స్ చేసి ప్రకటించారు. దానితో అల్లు ఫాన్స్ థ్రిల్ అయ్యారు. పుష్ప ద రైజ్ తో అల్లు అర్జున్- సుకుమార్ భారీ హిట్ కొట్టి పుష్ప 2 పై అంచనాలు పెంచేశారు. పుష్ప 1 లో మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ కేరెక్టర్ ని చాలా తక్కువ నిడివితో ఉంచారు. పార్ట్ 2 మొత్తం ఫహద్ ఫాసిల్ - అల్లు అర్జున్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారట. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మాస్ లుక్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు తాజాగా పుష్ప 3 కూడా ఉండబోతుంది అంటూ ఫహద్ ఫాసిల్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ ఫహద్ ఫాసిల్ కి స్టోరీ చెప్పినప్పుడు పుష్ప మాత్రమే ఉందని చెప్పారట. పోలీస్ స్టేషన్ సీన్ సెకండాఫ్‌లో నా పాత్ర తర్వాత.. అది 2 పార్ట్శ్ గా మారింది అని, ఇటీవల నాతో సుకుమార్ సార్ మాట్లాడినప్పుడు.. పుష్ప3 మూవీకి స్కోప్ ఉందని చెప్పారని.. పార్ట్ 3 సుకుమార్ దగ్గర అంతా సిద్ధంగా ఉంది అంటూ ఫహద్ ఫాసిల్ ఇప్పుడు పుష్ప పార్ట్ 3 ని కన్ ఫామ్ చేసాడు. మరి పుష్ప స్టోరీని కేవలం రెండు పార్ట్ లేమిటి.. చాలా భాగాలుగా తియ్యొచ్చు.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Fahadh Faasil says scope for Pushpa 3:

Fahadh Faasil revealed that director Sukumar has enough material to even make Pushpa 3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs