మెగాస్టార్ చిరు పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటున్నారు. మధ్యలో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ సీఎం జగన్ ని కలవడం, ఆయనతో మీటింగ్స్ విషయాల్లో చిరు ని మెచ్చుకున్నవాళ్లూ ఉన్నారు, అదే లెవల్లో విమర్శించిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా ప్రధాని మోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు హాజరై అక్కడ అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరు కూడా హాజరయ్యారు. అదే విషయంపై నారాయణ చిరుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
అల్లూరి సీతారామరాజు సినిమా చేసి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సూపర్ స్టార్ కృష్ణను ఈ అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానిస్తే చాలా బాగుండేదని, ఊసరవెల్లిలా రంగులు మార్చే చిరంజీవిని వేడుకకు ఆహ్వానించడం కరెక్ట్ కాదని ఆయన చిరు పై కామెంట్స్ చేసారు. అంతేకాకుండా జనసేన నేత పవన్ కళ్యాణ్ ఒక ల్యాండ్ మైన్ వంటి వారని.. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలియదని నారాయణ అన్నారు. నారాయణ మీడియా తో మాట్లాడుతూ అన్న చిరు, తమ్ముడు పవన్ పై ఈ వ్యాఖ్యలు చేసారు.