యంగ్ హీరోలు, ఇప్పుడు కొత్తగా స్టార్స్‌గా మారిన హీరోలు కూడా వరుసబెట్టి సినిమాలు చేయడానికి వెనుకంజ వేస్తున్న సమయంలో సీనియర్ స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలయ్య మాత్రం దూకుడుగా వెళ్లిపోతున్నారు. బాలయ్య స్పీడ్ చూస్తుంటే.. ఏజ్ ఆయనకి జస్ట్ నెంబర్ మాత్రమే అనేలా ఇప్పుడంతా అనుకుంటుండటం విశేషం. ‘అఖండ’ చిత్రంతో బాక్సాఫీస్‌పై శివతాండవం ఆడేసిన బాలయ్య.. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘NBK107’తో మరో పవర్ ఫుల్ హిట్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ ఆ ఛాయలను అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా. ఆ చిత్రం సెట్స్‌పై ఉండగానే బాలయ్య తన అభిమానులకు మరో గుడ్ న్యూస్‌ను చెప్పబోతున్నారు.
బాలయ్యతో సినిమా కోసం ఎప్పటి నుండో దర్శకుడు అనిల్ రావిపూడి వేచి చూస్తున్న విషయం తెలిసిందే. ఇది అనిల్ రావిపూడికి డ్రీమ్ ప్రాజెక్ట్. తనను ఎంతగానో అభిమానించే అనిల్ రావిపూడికి అవకాశం ఇవ్వడమే కాకుండా.. తన ‘NBK108’ చిత్రాన్ని ప్రారంభించేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది. రెగ్యులర్ షూటింగ్ దసరా తర్వాత నుండి మొదలుకానుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేశాడని, మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు.