Advertisement
Google Ads BL

ఫైనల్ గా విడాకులే పరిష్కారం: సెలెబ్రిటీ జంట


విడాకులు అనేది ఫ్యాషన్ అయ్యిపోయింది అనే కామెంట్ ఇప్పుడు తరచూ వినిపిస్తున్న మాట. వివాహ బంధంలో వచ్చిన ఒడిదుడుకులకు ఎదురు నిలబడి పోరాడితే.. ఆ జంట ఎన్నటికీ విడిపోదు, కాదు మేము సర్దుకుపోలేకపోతున్నాం అందుకే విడిపోతున్నాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అంతేకాదు నువ్వెంత అంటే నువ్వెంత అనే జంటలు ఈ విడాకులకు కారణమవుతున్నారు. ఈమధ్యన సెలెబ్రిటీ జంటలు చాలామంది విడాకులు తీసుకుని షాకిస్తున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య - సమంత, ధనుష్, ఐశ్వర్య ల జంట రీసెంట్ గా విడాకులు తీసుకుని ఫామిలీస్ కి, ఫాన్స్ కి షాకిచ్చారు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు మరో సెలెబ్రిటీ జంట అస్సలు కాంప్రమైజ్ కాలేకపోతున్నాం.. ఫైనల్ గా విడాకులే సొల్యూషన్ అంటుంది. వాళ్లెవరో కాదు.. దర్శకుడు శ్రీను వైట్ల - రూప ల జంట. వీరిద్దరికి గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నా.. మధ్యలో పెద్దవాళ్ళు కలగజేసుకుని వీరిద్దరిని కలిపారు. కొన్నేళ్ల క్రితమే వాళ్లిద్దరూ విడాకులు తీసుకుందామనుకున్నారు. శ్రీను వైట్ల ప్రస్తుతం ఫామ్ లో లేరు. గతంలో శ్రీను వైట్ల చేసిన సినిమాలకు భార్య రూప కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేసింది. ఇక తర్వాత ఇద్దరూ గొడవలు పడుతూ ఉన్నారు. మధ్యలో కాంప్రమైజ్ అయినా.. నాలుగేళ్లుగా రూప ఒంటరిగా ఉండడమే కాకుండా ఆమె నాంపల్లి కోర్టులో విడాకులకు అప్లై చేసినట్లుగా తెలుస్తుంది. 2003 లో వివాహం చేసుకున్న ఈజంటకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 

Srinu Vaitla and his wife Roopa file for divorce:

Srinu Vaitla Wife Moves Court For Divorce After Living Separately For 4 Years
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs