Advertisement
Google Ads BL

బిగ్ బాస్ నోయెల్ ఇంట విషాదం


నటుడు, సింగర్, బిగ్ బాస్ ఫేమ్ నోయెల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ తండ్రి ఈ శనివారం రాత్రి కన్ను మూయడంతో నోయెల్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. నోయెల్‌కు తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పంచుకున్న చాలా వీడియోలను నోయెల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటాడు. బిగ్ బాస్ కి వెళ్లిన కొత్తలో ప్రమోషన్స్ కోసం తండ్రి తో చేసిన వీడియో ని సోషల్ మీడియాలో ఉంచింది ఆయన పిఆర్ టీం

Advertisement
CJ Advs

ఇక నోయెల్ బిగ్ బాస్ కి వెళ్ళకముందు ప్రేమ వివాహం చేసుకున్న ఎస్తర్ తో విడిపోయి విడాకులు తీసుకున్నాడు. సింగర్ గా గుర్తింపు పొందిన నోయెల్ నటుడిగాను పలు సినిమాలు చేసాడు. బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులని ఆకట్టుకున్న నోయెల్ తండ్రి మరణంతో కుంగిపోయినట్లు తెలుస్తోంది. నోయెల్ తండ్రి మరణ వార్త విన్న పలువురు స్నేహితులు, తోటి సింగర్స్ ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

Singer Noel father passes away:

Bigg Boss Telugu 4 Fame Noel Sean Father Samuel Sean Died
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs