‘పుష్ప’తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిన రష్మిక మందన్న.. ఇప్పుడస్సలు ఏ విషయంలోనూ తగ్గట్లేదు. శాండల్‌వుడ్‌లో నార్మల్ హీరోయిన్‌గా మొదలైన ఆమె ప్రస్థానం.. టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌కి చేరింది. ఇప్పుడు ఆమె కన్ను బాలీవుడ్‌పై ఉంది. ‘పుష్ప’ ఆమెను బాలీవుడ్ వారికి దగ్గర చేయడంతో.. ఆ ఛాన్స్‌ని చక్కగా వాడుకుంటుందీ కన్నడ బ్యూటీ. బాలీవుడ్‌లో కూడా తన స్టామినా ఏంటో చూపించేందుకు అస్సలు తగ్గేదే లే అన్నట్లుగా.. ఆమె వ్యవహారం ఉంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో జరిగిన ఓ అవార్డ్స్ వేడుకకు హాజరైంది. రష్మిక ఈ వేడుకకు హాజరైన విధానంపై ఇప్పుడంతా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆమె వేసుకుని వచ్చిన డ్రస్సు.. ఆ డ్రస్సులో ఆమె విరబోసిన అందాల గురించే హాట్ హాట్‌గా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ డ్రస్సులో ఆమె కనిపించిన తీరు.. కేవలం బాలీవుడ్‌నే కాదు, యావత్ సినీ ఇండస్ట్రీలలో సెగలు రేపుతోంది.
బాలీవుడ్‌లో జరిగిన హెచ్‌టి స్టైల్ అవార్డ్స్ ఈవెంట్‌కు రెడ్ గౌను వేసుకుని వచ్చింది రష్మిక మందన్న. ఈ గౌనులో ఆమె నుండి ఏ యే అందాలు ఎక్స్‌పోజ్ అవ్వాలో.. అవి ఎక్స్‌పోజ్ అవ్వడంతో.. ఈవెంట్‌కి వచ్చిన వారందరిలో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా రష్మిక నిలిచింది. కెమెరాలు కూడా ఆమెను వదిలి పక్కకు పోను అన్నట్లుగా.. క్లిక్ మంటూనే ఉన్నాయి. ఇదే ఈవెంట్‌లో మీడియా వారు ఆమెతో ఫొటో దిగేందుకు ఎగబడ్డారు. ఒకానొక సమయంలో వారి తీరుతో ఆమె అసహనానికి కూడా గురైంది. అయినా కూడా నవ్వుతూ వారి కెమెరాకు ఫోజులిచ్చింది. ఆమె వేసుకొచ్చిన డ్రస్సు కూడా ఆమెను ఇబ్బందికి గురిచేసింది. అస్తమానం సర్దుకోవడమే పనిగా.. ఆమె తీరు ఉంది. ఏదైతేనేం.. ఒక్క డ్రస్సుతో పాన్ ఇండియా వైడ్‌గా ఆమె గురించి మాట్లాడుకునేలా రష్మిక చేసిందన్నది మాత్రం నిజం.