Advertisement
Google Ads BL

వానలైతే ఏంటి.. వారియర్ కుమ్మేస్తున్నాడుగా!


యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు నిజమైన వర్షం బీభత్సాన్ని సృష్టిస్తుంటే.. మరో వైపు.. ఈ సినిమా చూడటానికి ఇటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు వస్తారా? రారా? అనే అనుమానాలను పటాపంచల్ చేస్తూ.. ‘వారియర్’ దూసుకుపోతున్నాడు. మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు టాక్‌తో పని లేకుండా.. కలెక్షన్లు వస్తాయని ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి. ఇటీవల వచ్చి బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించిన ‘పుష్ప’ చిత్రానికి కూడా మొదటి రెండు, మూడు రోజులు దారుణమైన టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందింది. సేమ్ టు సేమ్ ‘ది వారియర్’ చిత్రానికి కూడా రిలీజ్ రోజు టాక్ కొంచెం తేడాగా వినబడినప్పటికీ.. వస్తున్న కలెక్షన్ల పరంగా చూస్తే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘ది వారియర్’ గ్రాండ్ సక్సెస్‌ని సాధించినట్లే. 

Advertisement
CJ Advs

 

ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకే.. దాదాపు రూ. 11 కోట్ల షేర్‌ను సాధించింది. వానలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులను ఫేస్ చేస్తున్నా.. ఈ రేంజ్‌లో కలెక్షన్లు సాధించడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. అందుక్కారణం ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్న మాస్ ఎలిమెంట్సే అని ఒప్పుకోవాలి. వానలు, వరదలు సంగతి పక్కన పెడితే.. ఈ మధ్య కాలంలో విడుదలైన ఏ చిత్రం కూడా ఈ తరహాలో రెస్పాన్స్‌ని అయితే పొందలేదు. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మానేసిన ఈ పరిస్థితుల్లో.. ప్రేక్షకులను మెప్పించి.. థియేటర్లకు కూడా రప్పిస్తున్నాడంటే.. ఈ వారియర్ యుద్ధం గెలిచిన వీరుడే అని ఫిక్స్ అయిపోవచ్చు.

The Warrior Movie Creates Records at Box Office :

The Warrior Movie Result at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs