Advertisement
Google Ads BL

ట్రైలర్: రామారావుగా రవితేజ రఫ్ఫాడించేశాడు


ఒక సినిమా హిట్టయితే.. నాలుగు సినిమాలు ఫ్లాప్ అన్నట్లుగా రవితేజ కెరీర్ నడుస్తుంది. ‘క్రాక్’తో బీభత్సమైన ఫామ్‌లోకి వచ్చేశాడని అనుకునేలోపే ‘ఖిలాడి’ రూపంలో రవితేజను ఫ్లాప్ పలకిరించింది. అయినా సినిమాల విషయంలో రవితేజ స్పీడ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా కాకుండా మరో ఐదారు సినిమాలు రవితేజ చేతిలో ఉన్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్ర సెట్స్‌లోకి రవితేజ ఎంటరైన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్‌తో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ‘క్రాక్’లాంటి హిట్ మరోసారి రవితేజకి రాబోతున్నట్లుగా అయితే అనిపిస్తుంది. రవితేజ ఇందులో ఓ పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు.

Advertisement
CJ Advs

 

‘‘ఇన్నాళ్లూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌గా చట్టప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను.. ఇకపై రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను’’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో ఈ ట్రైలర్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్.. ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో బ్రిలియంట్‌గా సాగింది. ట్రైలర్ స్టార్టింగ్‌లోనే ఒక ఆపరేషన్‌లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు మాయమయ్యారని చెప్పడం, ‘మా నాన్నని వెదకడానికి హెల్ప్ చేస్తారా?’ అని ఓ పాప ప్రాధేయపడుతూ అడగడం.. సినిమాలో ఎమోషన్ ఏ స్థాయిలో ఉండబోతుందో పరిచయం చేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, రవితేజ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథపై ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచేసింది. ఒక ప్రాంతంలోని వ్యక్తులు ఎందుకు మిస్ అవుతున్నారు? ఆ ఆపరేషన్ వెనుక ఉన్నదెవరు? ఈ మిస్టరీని రామారావు ఎలా చేధిస్తాడనే విషయాలతో ట్రైలర్‌ను చాలా గ్రిప్పింగా కట్ చేశారు. ‘కనిపించకుండాపోయింది ఒక్కరో ఇద్దరో కాదు’ అని రామారావు చెప్పడం మరింత థ్రిల్, సస్పెన్స్‌ని యాడ్ చేసింది. ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన అన్ని ఎలిమెంట్స్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రజంట్ చేశారు. 

 

బలమైన కథ, కథనం, పాత్రలు, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి అనేది తెలియజేయడంలో ట్రైలర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది. రవితేజలోని డిఫరెంట్ వేరియేషన్స్‌ని చూపిస్తూనే.. కథపై ఇంట్రస్ట్ కలిగేలా చేయడమే కాకుండా.. సినిమా కోసం వేచి చూసేలా ట్రైలర్ ఉంది. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై భారీగానే అంచనాలను పెంచారు. ఇక జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ఎటువంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. 

>ట్రైలర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Ravi Teja Ramarao On Duty Trailer Talk:

Ramarao On Duty Trailer Report
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs