సమంత నాగ చైతన్య కి విడాకులు ఇచ్చిన తర్వాత కెరీర్ లో దూసుకుపోవడం అటుంచి.. గ్లామర్ పరంగా కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. పుష్ప సినిమాలో ఉ అంటావా మావా.. సాంగ్ లో రెచ్చిపోయి గ్లామర్ షో చెయ్యడం సమంత కి బాగా హెల్ప్ అయ్యింది. ఎందుకంటే ఆ సాంగ్ చూసాక సమంత కి బాలీవుడ్ నుండి ఆఫర్స్ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కూడా సమంత ఉ అంటావా సాంగ్ అంటే ఇష్టం అంటూ చెప్పడంతో సమంత క్రేజ్ మరింత పెరిగింది. ఆ సాంగ్ తో సమంత కి పెరిగిన క్రేజ్ మాములుగా లేదు.
ఇప్పుడు ఆ సాంగ్ ని మించి మరొక సాంగ్ చెయ్యబోతుందట సమంత. అది కూడా తాను నటిస్తున్న యశోద సినిమా కోసమే. హీరోయిన్ సెంట్రిక్ మూవీ గా తెరకెక్కిన యశోద షూటింగ్ పూర్తయ్యింది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం దర్శకుడు ఓ మాస్ సాంగ్ డిజైన్ చేసాడట. హైదారబాద్ లో వేసిన ప్రత్యేమైన సెట్ లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అందించిన మాస్ సాంగ్ పుష్ప లో ఉ అంటావా సాంగ్ కి మించి సాంగ్ కి మించి సమంత మాస్ స్టెప్స్ వేస్తోందట.