క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటించింది రాశీ ఖన్నా. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. రీసెంట్‌గా గోపీచంద్ - మారుతి కలయికలో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ మూవీలో నటించింది. ఆ సినిమా కూడా ఆమెకి సక్సెస్ ఇవ్వలేదు. బరువు తగ్గి గ్లామర్ పెంచినా.. ఆమె గ్లామర్ హైలెట్ అవుతుంది కానీ.. ఆమెకి పేరు రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో కలిసి ‘థాంక్యూ’ మూవీ చేసింది. ఆ సినిమా రేపు శుక్రవారం రిలీజ్ కాబోతుంది. నాగచైతన్యతో ప్రస్తుతం రాశీ ఖన్నా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ సినిమా సక్సెస్ మీదే రాశీ ఖన్నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టిందా.. అమ్మడు పని అవుట్.
బొద్దుగా బబ్లీగా ఉన్న రాశీ ఖన్నా బరువు తగ్గాక కూడా సో సో ఆఫర్స్ వస్తున్నాయి. హిందీలో షాహిద్ కపూర్ లాంటి హీరోలు నటించిన రుద్ర వెబ్ సీరీస్‌లో నటించింది. ఆ సీరీస్‌లో రాశీ ఖన్నా రోల్ నెగెటివ్ టచ్‌లో ఉంటుంది అంటూ ఆమె థాంక్యూ ప్రమోషన్స్‌లో చెబుతుంది. ఇప్పటివరకు గ్లామర్‌గా, పాజిటివ్ కేరెక్టర్స్ చేసిన తనకి ఈ రుద్ర సీరీస్‌లో నెగెటివ్ రోల్ చేయాలంటే భయపడిందట.. ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. మరి ప్రస్తుతం రాశీ ఖన్నా ఆశలన్నీ చైతు థాంక్యూ మీదే ఉన్నాయి. థాంక్యూ రాశీకి హిట్ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు.