Advertisement
Google Ads BL

మోసం చేస్తున్నారు కాబట్టే.. వారికి హిట్స్ లేవు


జబర్దస్త్ నుండి మెల్లగా తప్పుకున్నోళ్ళు అందరూ వెండితెర మీద వెలిగిపోతున్నారు. సినిమాలతో బిజీ అయిన కారణంగానే జబర్దస్త్ నుండి తప్పుకున్నారు అంటూ వారి ఫ్రెండ్స్ చెప్పడమే కానీ.. ఆది కానీ, సుధీర్ కానీ, అనసూయ కానీ చెప్పడం లేదు. జబర్దస్త్ నెలలో రెండు మూడు రోజులు ఉంటుంది. ఈమాత్రం దానికే బిజీ అంటూ ఓవర్ చేస్తున్నారు. వారు చేసే సినిమాలేమి హిట్ కూడా అవ్వలేదు. ఈమాటన్నది ఎవరో కాదు. జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు. అయన రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటలన్నారు.

Advertisement
CJ Advs

 

‘‘సుధీర్ తాను బిజీ అంటూ జబర్దస్త్ వదిలేశాడు. ఏదో సినిమాల్లో బిజీగా ఉన్నామని చెప్పుకుంటారు. సుధీర్ చేసిన ఏ సినిమా ఆడిందో చెప్పమనండి, సాఫ్ట్‌వేర్ సుధీర్ ఆడిందా? లేదంటే త్రీ మంకీస్ ఆడిందా? వీటి వలన నిర్మాతలకు బోలెడంత లాస్. మనం మంచివాళ్లమైతే మనకి సక్సెస్ వస్తుంది. నేను ఎలాంటి కల్మషం లేకుండా నా పని నేను చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. కానీ వాళ్లు మోసం చేస్తున్నారు కాబట్టే హిట్ కొట్టడం లేదు..’’ అంటూ సుధీర్‌పై ఏడుకొండలు చేసిన డైరెక్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Jabardasth Production Manager Yedukondalu Sensational Comments on Sudheer:

Thats way no hit to Sudigali Sudheer says Yedukondalu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs