Advertisement
Google Ads BL

ఆర్పీ పరువు తీసిన ఏడుకొండలు


కిర్రాక్ ఆర్పీ.. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలపై జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడు కొండలు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆర్పీ ఫుడ్ బాగా లేదు, అక్కడ బానిస బ్రతుకులు అంటూ మాట్లాడుతున్నాడు.. నేను ఉండగా అక్కడ అలాంటిదేం జరగలేదు. ఆర్పీ భాగోతం ఏమిటో నేను చెబుతాను అంటూ ఏడుకొండలు ఆర్పీ గుట్టు రట్టు చేశాడు. ఆర్పీ జబర్దస్త్ నుండి బయటికి వచ్చాక అదిరింది చేశాడు. అది అయ్యాక ఓ నిర్మాతని పట్టుకుని సినిమా మొదలు పెట్టాడు. నేను ఒక్కో సినిమాకి మేనేజర్‌గా 30 నుండి 40 వేలు తీసుకుంటాను. అయితే ఆర్పీ ఆఫీస్ తీశాక నన్ను పిలిపించాడు. నేను సినిమా చేస్తున్నా మేనేజర్‌గా మీరుండాలి అని అడిగాడు. సరే నాకు 50 వేలు కావాలి, అది కూడా 1వ తారీఖునే నా అకౌంట్‌లో డబ్బులు పడాలి అని చెప్పా.. ఒప్పుకున్నాడు. 50 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

 

నేను ఆర్పీపై నమ్మకం లేక నా భార్యకి ఇచ్చి అవి వాడొద్దు, మనోడు సినిమా ఆపేసేలా ఉన్నాడు. మళ్ళీ ఇచ్చేద్దామని చెప్పి 15 రోజులు అలానే ఉంచాను. తర్వాత ఆర్పీ మ్యూజిక్ డైరెక్టర్, కెమెరా మ్యాన్ ఇలా చాలామందికి అడ్వాన్స్ ఇప్పించాడు. తర్వాత తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని, తన నిర్మాతని తిట్టడం స్టార్ట్ చేశాడు. నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చాను. తర్వాత ఆర్పీ నటులని ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉండేవాడు. ఆర్పీ చేసే పనులు చూడలేక నిర్మాత సినిమా ఆపేశాడు. ఆర్పీ దగ్గర కథ నచ్చి నిర్మాత నీకు 15 లక్షలు ఇస్తా కథ ఇవ్వమన్నాడు. నేను ఇవ్వను అన్నాడు.. తర్వాత ఆర్పీని ఆఫీస్ నుండి గెంటేశారు.. అలా అతని సినిమా ఆగిపోయింది అంటూ ఏడు కొండలు ఆర్పీ బండారం బట్టబయలు చేశాడు.

Jabardasth Production Manager Yedukondalu Sensational Comments on Kiraak RP:

Jabardasth Production Manager Yedukondalu Revelaed Kiraak RP secrets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs