Advertisement
Google Ads BL

సుధీర్ గుట్టు రట్టు చేసిన మేనేజర్


సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఉత్తి సుధీర్. అంటే ఈటీవి లో తనకి ఐడెంటిటి ఇచ్చిన సుడిగాలిని వదిలేసి.. ప్రస్తుతం స్టార్ మా లో తేలాడు. ఈటీవీలో జబర్దస్త్, ఢీ డాన్స్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ బిజీ బిజీగా వున్న సుధీర్ మెల్లగా ఢీ షో నుండి, తర్వాత జబర్దస్త్ నుండి ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి తప్పుకుని స్టార్ మా కి వచ్చేసాడు. సుధీర్ సినిమాలతో బిజీ అయ్యాడు. స్టార్ మా లో మంచి ఆఫర్ వచ్చింది కాబట్టే జబర్దస్త్ ని, ఈటీవిని వదిలేసాడని అంటున్నారు. అయితే తాజాగా జబర్దస్త్ లో మేనేజర్ గా పని చేసి మానేసిన ఏడుకొండలు సుధీర్ గుట్టు రట్టు చేసాడు. అంటే సుధీర్ కెరీర్ ఆరంభంలో ధనరాజ్, వేణు స్కిట్స్ లో చేసేవాడని, తర్వాత టీం గా ఫామ్ అయ్యి సక్సెస్ అయ్యాడని చెప్పిన ఏడుకొండలు..

Advertisement
CJ Advs

సుధీర్ జబర్దస్త్ నుండి ఎప్పటికి వెళ్ళను అని మాటిచ్చాడని, కేవలం సుధీర్ మాత్రమే కాదు, శ్రీను కూడా మాట ఇచ్చాడని, కానీ ఇప్పుడు జబర్దస్త్ ని వదిలేసి బయటికి వచ్చేసాడని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పగా సదరు యాంకర్ మీరు ఇప్పటికి సుధీర్ కి కాంటాక్ట్ లో ఉన్నారా అని అడగగా.. సుధీర్ ఇప్పుడు ఎదిగిపోయాడు, నా ఫోన్ కూడా ఎత్తడు అంటూ ఆ ఇంటర్వ్యూలోనే తన ఫోన్ నుండి సుధీర్ కి ఫోన్ చేసి చూపించగా సుధీర్ మాత్రం ఫోన్ ఎత్తలేదు. ఇది పరిస్థితి అని చెప్పిన ఏడు కొండలు, ఈమధ్యన ఓ షాప్ ఓపెనింగ్ కోసం నేను సుధీర్ కి పదిసార్లు ఫోన్ చెయ్యగా ఓసారి ఎత్తి ఏమిటి అని అడిగాడు. నేను షాప్ ఓపెనింగ్ ఉంది వస్తావా అని అడిగితే మా మేనేజర్ ని అడగండి అన్నాడు. సుధీర్ ఇప్పుడు డబ్బు, ఫాన్స్, ఫేమ్ సంపాదించాక కింది వాళ్ళని మరిచిపోయాడు అంటూ జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Yedukondalu sensational comments on Sudheer:

Jabardasth former Manager Yedukondalu sensational comments on Sudheer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs