Advertisement
Google Ads BL

అందుకే ఆర్పీ కడుపుమంట


ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ నిండా కిర్రాక్ ఆర్పీ న్యూస్ లే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. జబర్దస్త్ తో ఫెమస్ అయ్యి ఇప్పుడు అన్నం పెట్టిన సంస్థపైనే సంచలన ఆరోపణలు చేస్తున్న కిర్రాక్ ఆర్పీ కి ఇన్నాళ్లు లేని బాధ ఇప్పుడెందుకు వచ్చింది, ఉన్నట్టుండి జబర్దస్త్ ని విమర్శించాల్సిన అవసరం ఏం వచ్చిందో ఎవరికీ అర్ధం కావడమే లేదు. అయితే ఆర్పీ కి కౌంటర్ ఎటాక్స్ ఇస్తున్న ఆది, రామ్ ప్రసాద్, షేకింగ్ శేషు, తాజాగా జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. ఆర్పీ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్ధమవుతుంది. అసలు ఆర్పీ కడుపు మంటకి కారణం అంతా అని చాలామంది తెగ ఆలోచించేస్తున్నారు. ఆర్పీ జబర్దస్త్ నుండి నాగబాబు గారితో బయటికి వచ్చేసాక జబర్దస్త్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసాడు. 

Advertisement
CJ Advs

తర్వాత అదిరింది ప్రోగ్రాం సక్సెస్ అవ్వక, అది ఆగిపోయాక సినిమాకి డైరెక్షన్ చేస్తా అంటూ బయలుదేరాడు. ఏదో ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకుని సినిమా మొదలు పెట్టిన తర్వాత కొన్నిరోజులకే ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఆ సినిమా ఆగిపోవడానికి కారణం మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని ఆర్పీ అనుకుని అప్పటినుండి ఆయన్ని తిట్టడం మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆర్పీ మాటల్లోనే నన్ను సినిమా చెయ్యనియ్యకుండా చేసాడు అంటూ చెప్పడం చూస్తే ఆర్పీ మల్లెమాలపై, శ్యాం గారిపై కడుపు మంటతో చేస్తున్న వ్యాఖ్యలకు కారణం అదే అనిపిస్తుంది.

Kiraak RP comments on Shyam Prasad Reddy:

Kiraak RP comments on Mallemala, Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs