Advertisement
Google Ads BL

జబర్దస్త్ షో మీద16 ఎకరాలు సంపాదించా


జబర్దస్త్ కామెడీ కన్నా జబర్దస్త్ పాలిటిక్స్ ఇప్పుడు రసవత్తరంగా మారాయి. గత వారం రోజులుగా జబర్దస్త్ రాజకీయాలు యూట్యూబ్ ఛానల్స్ చుట్టూ తిరుగుతున్నాయి. కిర్రాక్ ఆర్పీ vs ఆది, రామ్ ప్రసాద్, షేకింగ్ శేషు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఆర్పీ మల్లెమాల యాజమాన్యం పై చేసిన సంచలన కామెంట్స్ ని తిప్పికొట్టే ప్రాసెస్ లో చాలా విషయాలు రివీల్ అవుతున్నాయి. అందులో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. నేను జబర్దస్త్ కి వచ్చే ముందు 20 లక్షల అప్పులు కారణంగా మూడు ఎకరాలు అమ్మి అప్పులు తీర్చి ఫ్రెష్ మైండ్ తో జబర్దస్త్ కి వచ్చి స్కిట్స్ రాస్తూ సక్సెస్ అయ్యాను. అదిరే అభి అన్న, జబర్దస్త్ కారణంగానే నేను సక్సెస్ అయ్యాను అంటూ హైపర్ ఆది ఓపెన్ కామెంట్స్ చేసాడు.

Advertisement
CJ Advs

తాను జబర్దస్త్ లో ఫెమస్ అయ్యి పొలాలు అమ్మిన ఊరిలోనే మళ్ళీ 16 ఎకరాల పొలం కొన్నాను, నా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండడమే కాదు, నాలుగు వేళ్ళు లోపలి వెళ్ళడానికి కారణం జబర్దస్త్ అంటూ ఆది తాను జబర్దస్త్ ద్వారా ఎంత సంపాదించాడో చెప్పుకొచ్చాడు. తాను ఒక్కడి వల్లే తన టీం సక్సెస్ అవ్వలేదు అని, తన టీం మేట్స్, ముఖ్యంగా తనకి అవకాశం ఇచ్చిన అభి అన్న, జబర్దస్త్ కారణంగానే తాను ఎదిగాను అని, ఇలా చెప్పడానికి ఎలాంటి సిగ్గు పడడం లేదు అంటూ ఆది కామెంట్స్ చేసాడు.

Hyper Aadi comments Jabardasth remuneration:

Hyper Aadi Remuneration For Jabardasth Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs