Advertisement
Google Ads BL

డబుల్ పేమెంట్ అంటున్న కేజిఎఫ్ సంచలనం


కేజిఎఫ్ 1 అండ్ 2 తో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టడమే కాదు, ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఇలా అందరూ ఫెమస్ అయ్యారు. కన్నడ ఇండస్ట్రీ ని ప్రపంచానికి పరిచయం చేసారు. అందుకే ఇప్పుడు కేజిఎఫ్ స్టార్స్ ఏ సినిమా చేసినా దానిపై పిచ్చ హైప్ ఉంటుంది. యశ్ తన 19 వ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా అని వెయిటింగ్ లో ఉన్నారు ఫాన్స్. మరోపక్క ప్రశాంత్ నీల్ సలార్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి ఏకంగా విక్రమ్ కోబ్రాలో నటించేసింది. మరి కేజిఎఫ్ హిట్ అయ్యాక అమ్మడు పారితోషకంపై రకరకాల న్యూస్ లు చక్కర్లు కొట్టినట్లుగా శ్రీనిధి శెట్టి తన పారితోషకం కేజిఎఫ్ కన్నా డబుల్ చేసిందట.

Advertisement
CJ Advs

ఇప్పటికే కోబ్రా కి ఆమె డబుల్ పారితోషకం అందుకుంటున్నట్టుగా వార్తలొస్తున్నాయి. కేజిఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీనిధి శెట్టి దగ్గరకు వచ్చే దర్శకనిర్మాతలకు శ్రీనిధి తన రేటు ఎంత పెరిగిందో ఓపెన్ గా చెప్పి బెదరగొడుతుందట. ఇక ఇప్పుడు కోబ్రా కి శ్రీనిధి పారితోషకం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. కేజిఎఫ్ కి 3.5 కోట్లు అందుకున్న శ్రీనిధి ఇప్పుడు కోబ్రాకి 7 కోట్లు అందుకుంటుందట. మరి ఈ సినిమా కూడా హిట్ అయితే అమ్మడి రేంజ్ మరింతగా పెరగడం ఖాయం.

Srinidhi Shetty has charged double the KGF remuneration:

Srinidhi Shetty has charged double the KGF remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs