Advertisement
Google Ads BL

మెగాస్టార్ కోసం లాల్ సింగ్ చడ్ఢా మెగా ప్రివ్యూ


సూపర్ స్టార్ అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మ‌ధ్య‌ స్నేహం చాలా ఏళ్ల‌నాటిది. వారిద్ద‌రిది ప‌ర‌స్ప‌ర గౌర‌వ‌పూర్వ‌క‌మైనబంధం. సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం లాల్ సింగ్ చడ్ఢా.  ఇటీవలి కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వార‌సుడు నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మ‌రియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన లాల్ సింగ్ చడ్ఢా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమ‌యింది.

Advertisement
CJ Advs

ఇప్పుడు అమీర్ ఖాన్ తన ప్రియమిత్రుడు మెగాస్టార్ చిరంజీవి మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అతిథుల కోసం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన లాల్ సింగ్ చ‌డ్ఢా  ప్రత్యేక ప్రివ్యూను హైదారాబాద్ లో నిర్వహించారు. ఈ వారం మొద‌ట్లో హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరిగింది. ఈ ప్రివ్యూకి ప్రత్యేక అతిధులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్  డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్ గార్లు పాల్గొన్నారు. 

లాల్ సింగ్ చ‌డ్ఢా ప్రత్యేక ప్రివ్యూకి మెగాస్టార్ తో పాటు హాజరైన అతిథులంతా ఈ సినిమా ప‌ట్ల ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ ప్రివ్యూకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Aamir Khan organises a MEGA preview of Laal Singh Chaddha:

SuperStar Aamir Khan organises a MEGA preview of Laal Singh Chaddha for Megastar Chiranjeevi.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs