ఈమధ్యన జబర్దస్త్ లో లొసుగులు రచ్చ కెక్కాయి. రెండేళ్ల క్రితం జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసిన కిర్రాక్ ఆర్పీ అప్పట్లో జీ తెలుగులో అదిరింది ప్రోగ్రాం చేసాడు, ఇప్పుడు స్టార్ మా లో కామెడీ స్టార్స్ చేస్తూ జబర్దస్త్ పై, మల్లెమాల యాజమాన్యంపై రకరకాలుగా విరుచుకుపడుతున్నారు. దానితో జబర్దస్త్ టాప్ కమెడియన్స్ ఆది, రామ్ ప్రసాద్ లు ఆర్పీకి కౌంటర్ టాక్స్ ఇచ్చారు. తర్వాత జబర్దస్త్ లో కమెడియన్ గా చేసి ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిన షేకింగ్ శేషు.. ఆర్పీ మోసగాడు అంటూ యూట్యూబ్ ఇంటర్వూస్ ఇవ్వడం స్టార్ట్ చేసాడు. ఆర్పీ అంత మోసగాడు ఇంకెవరు లేరు అని, అతనితో సినిమా మొదలు పెట్టగానే నిర్మాత నష్టపోయాడని, ఆర్పీ హోమ్ టూర్ అంతా అబద్దం అని, అతని వేరే ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేసి చూపించి డబ్బు సంపాదించాడు.. అంటూ సంచలన కామెంట్స్ చేసాడు.
దానితో వెంటనే ఆర్పీ మళ్ళీ షేకింగ్ శేషు పై సంచలన కామెంట్స్ చేసాడు. శేషు కి నా విషయం ఎందుకు నేను జబర్దస్త్ గురించి మాట్లాడితే శేషు నా పర్సనల్ లైఫ్, నా సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి.. జబర్దస్త్ విషయంలో నాకు కాలింది నేను మాట్లాడా.. ఒకప్పుడు నాకు నచ్చిన జబర్దస్త్ ఇప్పుడు నచ్చడం లేదు.. నువ్వు కూడా జబర్దస్త్ విషయాలే మాట్లాడు కానీ నా సినిమా విషయాలు నీకనవరసం, నువ్వు ఛస్తే నీకు దినం చేస్తా, నీకు తద్దినం పెడతా శేషూ అంటూ బూతులతో ఆర్పీ రెచ్చిపోయి షేకింగ్ శేషు పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.