యంగ్ హీరో రామ్ - తమిళ్ డైరెక్టర్ లింగుసామి కాంబోలో బైలింగువల్ మూవీ గా తెరకెక్కిన ద వారియర్ మూవీ నేడు గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగే యుఎస్ లో ముందస్తుగా వారియర్ ప్రీమియర్స్ పడతాయేమో అని ఆయన ఫాన్స్ ఎదురు చూసినా... యుఎస్ దగ్గర నుండి ఇండియా వరకు ఒకేసారి సినిమా ని రిలీజ్ చేసారు. దానితో ఇప్పటివరకు వారియర్ టాక్ బయటికి రాలేదు. లేదంటే వారియర్ యుఎస్ ప్రీమియర్స్ రిపోర్ట్, ఓవర్సీస్ టాక్, సోషల్ మీడియా టాక్, యుఎస్ ఆడియన్స్ టాక్ అంటూ రామ్ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేది. ప్రస్తుతం ఉదయం షోస్ తో మొదలైన ద వారియర్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ బయటికి వచ్చింది,.
తమిళ డైరెక్టర్ కావడం, మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కావడంతో లింగుసామి రామ్ ని మాస్ యాంగిల్ లోనే ప్రెజెంట్ చేసారు. అటు డాక్టర్ లుక్ కానివ్వండి, ఇటు పోలీస్ లుక్ లో కానీ రామ్ చాలాబాగా సెట్ అయ్యాడంటున్నారు. అంతేకాకుండా విలన్ గా ఆదిపిని శెట్టి కేరెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేసాడు అని, మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించేదిలా ఉంది అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ లో రామ్ - కృతి శెట్టి ల రొమాంటిక్ ట్రాక్ వర్కౌట్ అవ్వలేదు అని, దేవిశ్రీ మ్యూజిక్ బావుంది అంటున్నారు. అటు సాంగ్స్, ఇటు బీజీఎమ్ రెండూ ఆకట్టుకున్నాయంటున్నారు. మాస్ ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ కిక్ ఇచ్చేదిలా ఉంది అంటున్నాయి యుఎస్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్స్. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉందొ అనేది వారియర్ రివ్యూలో చూసుకుందాం.