మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో మొదలు కావలసిన SSMB28 ఆగష్టు నుండి మొదలు పెట్టబోతున్నారు. ఎప్పుడో పూజా కార్యక్రమాలను జరుపుకున్న SSMB28 రెగ్యులర్ షూట్ ఆగష్టు లో మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. మహర్షితో మహేష్ తో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే నే SSMB28 లో మరోసారి మహేష్ తో జోడి కట్టబోతుంది. మరి త్రివిక్రమ్ సినిమాలంటే సెకండ్ హీరోయిన్ ఉండడం కంపల్సరీ.
ఈ సినిమాలో మహేష్ కి మరదలిగా పెళ్ళిసందడి హీరోయిన్ శ్రీలీల ని ఎంపిక చెయ్యడమే కాకుండా ఆమె రోల్ హైలెట్ అయ్యేలా త్రివిక్రమ్ చూస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ.. వారి పాత్రలు హైలెట్ కావు. అందుకే శ్రీలీల ఒప్పుకోకపోయినా త్రివిక్రమ్ ఆమె రోల్ నిడివి పెంచారని టాక్ కూడా నడిచింది. కానీ ఇప్పుడు చూస్తే శ్రీలీల మహేష్ మరదలి పాత్ర చెయ్యనంటుంది అంటున్నారు. కారణం ఆమెకి యంగ్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలు, మెయిన్ గా హైలెట్ అయ్యే హీరోయిన్ పాత్రలు రావడంతో మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చెయ్యనని చెప్పేస్తుందట.
మహేష్ అయితే ఏమిటి, సెకండ్ హీరోయిన్ గా మాత్రం చెయ్యనని తెగేసి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఇప్పుడు శ్రీలీల విషయంలో త్రివిక్రమ్ నిర్ణయం ఏమిటో చూడాలి.