యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరసగా సినిమాలు చెయ్యడమే కాదు, టపీ టపీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. రాజా వారు - రాణి గారు అంటూ హీరోగా అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం తర్వాత చేసిన SR కల్యాణమండపం సో సో గా ఆడింది. తర్వాత వచ్చిన సెబాస్టియన్ అట్టర్ ప్లాప్ అయ్యింది. సమ్మతమే అంటూ ఈమధ్యనే ప్రేక్షకుల ముందు వచ్చిన కిరణ్ అబ్బవరం కి ఆ సినిమా కూడా సక్సెస్ అందించలేదు. ఇక తాజాగా మరో రెండు సినిమాలు షూటింగ్స్ పూర్తి కావొస్తున్నాయి.
అందులో నేను మీకు బాగా కల్సిన వాడిని, మరొకటి వినరో భాగ్యము విష్ణు కథ ఉన్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అయినా కిరణ్ అబ్బవరం తనకి సక్సెస్ వస్తుంది అని నమ్ముతున్నాడు. స్వతహాగా కిరణ్ అబ్బవరం రైటర్. అలాంటి వాడు కథల ఎంపిక లో తడబడుతున్నాడు. వరస ప్రాజెక్ట్స్ ని ఓకె చేస్తున్నాడే కానీ, అందులో విషయం ఎంత ఉంది. ఎలాంటి కథలు ప్రేక్షకులకు రుచిస్తాయి అనే విషయమే మరిచిపోయాడు. అందుకే వరసబెట్టి సినిమాలు చేస్తున్నా వాటికి విజయం దక్కడం లేదు. మరి నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ అయినా ఈ హీరోకి హిట్ ఇస్తాయేమో చూడాలి.