Advertisement
Google Ads BL

ఎదురీదుతున్న రామ్


ప్రస్తుతం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలావరకు వరద భీబత్సం మాములుగా లేదు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు తెగిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ కష్టాలు. హైదరాబాద్ ని అయితే గత వారం రోజులుగా వరుణుడు గజగజా వణికిస్తున్నాడు. హైదరాబాద్ మాత్రమే కాదు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తెలంగాణలో అన్ని జిల్లాలు ఈ వరద భీబత్సంతో అతలాకుతలంగా ఉంది పరిస్థితి. వరుణ దేవుడు ఎప్పుడు శాంతిస్తాడురా మహా ప్రభో అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ హీరో రామ్ మాత్రం వరుణుడిని లెక్కచెయ్యకుండా ఎదురీదడానికి రెడీ అయ్యాడు. రామ్ నటించిన వారియర్ మూవీ రేపు గురువారం థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. 

Advertisement
CJ Advs

జనాలంతా అతి భారీ వర్షాల మూడ్ లో చికాకులో ఉన్నారు. కానీ రామ్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. వర్షాలను, వరదలను లెక్క చెయ్యకుండా నమ్మకంతో బాక్సాఫీసు దగ్గరకు దిగుతున్నాడు. మరి రామ్ వరదలకు ఎదురీదుతోంటే.. ప్రేక్షకుడు రామ్ ని ఏం పట్టించుకుంటాడో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. లింగుసామి దర్శకత్వంలో బైలింగువల్ మూవీ వారియర్ లో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన వారియర్ పై మంచి అంచనాలున్నాయి. మరి వరల్డ్ వైడ్ గా రేపు రిలీజ్ కాబోతున్న రామ్ ని వరుణ దేవుడు ఏ తీరానికి చేరుస్తాడో చూడాలి.

The warrior release on July 14th:

Ram The warrior release on July 14th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs