తమిళనాట విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్న పాలబుగ్గల హన్సిక అభిమానుల చేత గుడి కూడా కట్టించుకుంది. తెలుగు, తమిళ సినిమాలతో బిజీ అయినా స్టార్ ఛాన్సెస్ మాత్రం ఆమెకి తగల్లేదు. అయినా కెరీర్ లో ఖాళీ లేకుండా ఇంకా ఇంకా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం హన్సిక తన 50 వ సినిమా ప్రమోషన్స్ లో ఉంది. ఈ సినిమాలో ఒక బిడ్డకు తల్లిగా నటించాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పాత్ర. ఆ పాత్ర లో అన్ని ఎమోషన్స్, పెరఫార్మెన్స్ కి అవకాశం ఉన్న పాత్ర అని చెప్పింది.
ప్రస్తుతం తెలుగు, తమిళంలో చేతిలో 10 సినిమాలు ఉన్నట్టుగా చెప్పిన హన్సిక.. పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గతంలో శింబు తో ప్రేమాయణం నడిపిన హన్సిక అప్పటినుండి సింగిల్ గానే ఉంటుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పెళ్లి ఎందుకు చేసుకోవాలి, ప్రస్తుతం నేను సంతోషంగానే ఉన్నాను. ఇప్పటికీ నేను సినిమాలతో బిజీగా వున్నాను. ప్రస్తుతానికి వర్క్‌తోనే నా పెళ్లి. టైం వచ్చినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను.. అంటూ హన్సిక పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.