Advertisement
Google Ads BL

కోర్టు మెట్లెక్కిన దగ్గుబాటి రానా


విరాట పర్వం మూవీ లో రవన్న గా అద్భుతమైన పెరఫార్మెన్స్ కనబరిచిన పాన్ ఇండియా స్టార్ రానా తాజాగా కోర్టు మెట్లెక్కాడు. ఆ స్థలానికి సంబంధించి దాఖలైన పిటిషన్ కారణంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. హైద‌రాబాద్‌లోని కాస్ట్లీ ఏరియా లోని ఫిల్మ్ న‌గ‌ర్ ప‌రిధిలో ఓ స్థ‌లాన్ని 2014లో ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే ఆ సంస్థకు సంబందించిన య‌జ‌మాని కుమారుడు ఆ స్థలాన్ని ద‌గ్గుబాటి రానా పేరిట రిజిస్ట‌ర్ చేసిన‌ట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. 

Advertisement
CJ Advs

రానా పేరున ఆ స్థలం రిజిస్టర్ అవడంతో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. దానితో రానా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ వ్య‌వ‌హారంపై త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.

Daggubati Rana Attend Court:

Daggubati Rana Who Appeared In The Civil Court
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs