Advertisement
Google Ads BL

పెళ్లయ్యాక మరింత బిజీగా లేడీ సూపర్ స్టార్


నయనతార పెళ్లి చేసుకోవడమే కాదు, భర్త విగ్నేష్ శివన్ తో కలిసి జాలిగా హనీమూన్ ట్రిప్ వేసేసింది. హనీమూన్ ముగియగానే షూటింగ్స్ లో బిజీ అయ్యింది. కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార మొదటిసారి బాలీవుడ్ లో నటిస్తుంది. అది కూడా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా జవాన్ మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం నయనతార ముంబై హోటల్ లో ఉంటూ జవాన్ షూటింగ్ లో పాల్గొంటుంది. తాజాగా ఆమె భర్త విగ్నేష్ కూడా నయనతార దగ్గరకు వెళ్ళాడు.

Advertisement
CJ Advs

అయితే నయనతార పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుంది. విగ్నేష్ తల్లికి నయన్ మాటిచ్చింది, పెళ్లి తర్వాత షూటింగ్స్ కి వెళ్లను అంటూ ప్రచారం జరిగినా.. అది ఒట్టి రూమర్ అంటూ నయనతార తన పనిలో బిజీ అయ్యింది. తాజాగా నయనతార కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలవబోతున్న మూవీ ని జీ స్టూడియోస్ తో కలిసి చేయబోతుంది. తన కెరీర్ లో 75 వ మూవీ గా హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేయబోతుంది. ఈ సినిమాకి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. సత్యరాజ్, జై కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తు్న్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.  నయనతార - జీ స్టూడియోస్ కలయికలో మూవీ అనౌన్సమెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Nayanthara Teams Up With Zee Studios For Her Next Movie:

Nayanthara 75th film announced
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs