Advertisement
Google Ads BL

శ్రీజపై కళ్యాణ్ దేవ్ ఇండైరెక్ట్ పోస్ట్


చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, చిరు చిన్ననాటి స్నేహితుల కొడుకు కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది. ఆ తర్వాత శ్రీజ, కళ్యాణ్ లు చిరు ఇంట్లోనే ఉంటున్నారు. వారికి నైనికా అనే ఓ పాప కూడా ఉంది. గత ఏడాది నుండి శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ దేవ్ విడిపోయినట్లుగా మీడియాలో వార్తలు రావడమే కానీ.. ఇంతవరకు వారిద్దరి విడాకులపై మెగా కాంపౌండ్ స్పందించింది లేదు. ప్రస్తుతం అయితే కళ్యాణ్ దేవ్ - శ్రీజలు విడివిడిగానే ఉంటున్నారు. తాజాగా శ్రీజ పెద్ద కూతురు బర్త్ డే కి కళ్యాణ్ దేవ్ ఎలాంటి ట్వీట్ చెయ్యలేదు. అలాగే కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం సినిమాలకి దూరంగా కూడా ఉంటున్నాడు. ఈమధ్యన శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం షురూ అయ్యింది.

Advertisement
CJ Advs

అదలా ఉండగా కళ్యాణ్ దేవ్ తన తల్లి బర్త్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టాడు. అది కూడా శ్రీజ మీద ఇండెరెక్ట్ గా పోస్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. జీవితం ఒక్కోసారి ఎంతో కష్టతరంగా మారుతుంది.. కానీ నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో వాటిని ఎదుర్కొంటానని నమ్మకం నాకుంది. నాకు ఎల్లప్పుడూ నీ సపోర్టు నిలుస్తున్నందుకు థాంక్యూ మా.. అంటూ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంటే కళ్యాణ్ దేవ్ శ్రీజ ని వదిలి దూరంగా ఉన్న సమయంలో ఆయనకి తల్లి సపోర్ట్ లభించబట్టే ఇలాంటి పోస్ట్ పెట్టాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Kalyaan Dhev Emotional Wishes To His Mother:

 Kalyaan Dhev Emotional Birthday Wishes To His Mother
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs