Advertisement
Google Ads BL

నాగ్ 100వ సినిమాకి డైరెక్టర్ అతడేనా?


కింగ్ నాగార్జున తన మైల్‌స్టోన్ చిత్రానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘ది ఘోస్ట్’ చిత్రం.. నాగార్జునకి 98వ చిత్రం. 99వ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా.. మైల్‌స్టోన్ ఫిల్మ్ 100వ చిత్రానికి సంబంధించే వార్తలు హైలెట్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఈ మైల్‌స్టోన్ చిత్రానికి సంబంధించి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పేరు వినిపించింది. నాగార్జునతో ఎన్నో అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించిన దర్శకేంద్రుడు అయితే.. 100వ చిత్రానికి బాగుంటుందని అక్కినేని బృందం భావించి.. దర్శకేంద్రుని సంప్రదించగా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ మైల్‌స్టోన్ చిత్రం విషయంలో ఇప్పుడు మరో దర్శకుడి పేరు లైన్‌లోకి వచ్చింది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని రూపొందిస్తున్న మోహన్ రాజా.

Advertisement
CJ Advs

 

‘హనుమాన్ జంక్షన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మోహన్ రాజా.. ఆ తర్వాత తమిళ్‌లో చేసిన ‘తని ఒరువన్’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు. ఆ సినిమా తెలుగులో రామ్ చరణ్ రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్‌ఫాదర్’ టైటిల్‌తో మోహన్ రాజా రీమేక్ చేస్తున్నారు. ఇక నాగార్జున 100వ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ కథను నాగ్‌కు మోహన్ రాజా వినిపించారట. ఆ కథ బాగా నచ్చడంతో.. స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జునే నిర్మించడానికి సిద్ధమయ్యారనేలా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. అంతేకాదు, ఈ సినిమాలో అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారనేది టాక్. మరి ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియాలంటే.. కింగ్ 100పై అక్కినేని బృందం స్పందించాల్సిందే.

Nagarjuna finalized director for his milestone film:

Mohan Raja to Direct King Nag 100th Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs