సుడిగాలి సుధీర్ సినిమాల్లో హీరోగా బిజీ అయ్యాడు అందుకే జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు. ముందే ఢీ షో నుండి తప్పుకుని.. చివరికి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి బయటికి వెళ్ళాడు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంటే.. మధ్యలో ఆర్పీ ఓ ఇంటర్వ్యూలో సుధీర్ ఎన్నో అవమానాల మధ్యన ఈటివి నుండి బయటికి వచ్చేసాడు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దానితో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లు ఆర్పీ కి కౌంటర్ ఇచ్చే ప్రాసెస్ లో జబర్దస్త్ గురించి, కమెడియన్స్ గురించి, మల్లెమాల సంస్థ గురించి అనేక సంచలన నిజాలు బయట పెట్టారు. సుడిగాలి సుధీర్ ని జబర్దస్త్ నుండి ఎవరూ గెంటెయ్యలేదు. సుధీర్ అన్నే వెళ్ళిపోయాడు అంటూ ఆది చెప్పగా.. సుధీర్ ఈటీవిలోనే కాదు, వేరే ఛానల్ లోనూ వర్క్ చేసుకుందామనుకున్నాడు. కానీ ఈటీవీలో అగ్రిమెంట్స్ ఉంటాయి. దాని వల్ల ఇక్కడ అక్కడ షోస్ చేసుకునేందుకు కుదరదు.
ఏదో ఒక్కరోజు ప్రోగ్రాం కోసం అంటే పక్క ఛానల్ కి వెళ్లొచ్చు. కానీ రెగ్యులర్ షోస్ కి ఆ ఛానల్, ఈ ఛానల్ మారడానికి ఈటీవీలో కుదరదు. అందులో స్టార్ మా వాళ్ళు పారితోషకం పరంగా సుధీర్ క్రేజ్ ని బట్టి ఎక్కువగా ఫిక్స్ చేసారు. సుధీర్ అన్నకి డబ్బు అవసరం.. ఇక్కడి కన్నా అక్కడ ఓ 50 వేలో, లేదంటే ఓ లక్షో ఎక్కువ ఇస్తా అన్నారేమో అందుకే సుధీర్ ఛానల్ మారాడు.. ఈటీవిని వదిలేసాడు. కానీ ఎవరూ ఆయన్ని అవమానించి గెంటెయ్యలేదు. అదే విషయం సుధీర్ అన్న కూడా చెబుతాడు అంటూ సుధీర్ జబర్దస్త్ నుండి ఎందుకు వెళ్లిపోయాడో అసలైన కారణాన్ని బయటపెట్టారు ఆది, రామ్ ప్రసాద్ లు.