బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK107 కొత్త షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉండగా.. NBK107 టీంలోని కొంతమందికి వీసా ప్రోబ్లెంస్ వలన అమెరికా షెడ్యూల్ ఇప్పుడు టర్కీ కి మారబోతుంది. బాలకృష్ణ, గోపీచంద్ అలాగే టీం మెంబెర్స్ త్వరలోనే టర్కీకి వెళ్ళబోతున్నారు. అయితే బాలయ్య - గోపీచంద్ ల మూవీ మొదలైనప్పుడే ఈ సినిమా దసరా బరిలో నిలుస్తుంది అని అన్నారు. కానీ ఈమధ్యన బాలయ్యకి కరోనా రావడం, అలాగే అమెరికా షెడ్యూల్ క్యాన్సిల్ అవడంతో NBK107 షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.
దానితో దసరా బరిలో నిలవాల్సిన NBK107 ఇప్పుడు దసరా భారీ నుండి తప్పుకుని వేరే డేట్ పై కన్నేసినట్లుగా తెలుస్తుంది. అది కూడా గత ఏడాది బాలకృష్ణ కి అఖండమైన హిట్ అందించిన అఖండ రిలీజ్ డేట్ రోజునే NBK107 రిలీజ్ చేస్తే బావుంటుంది అని మేకర్స్ ఆలోచనట. డిసెంబర్ 2 న NBK107 ని విడుదల చెయ్యాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యారని, త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. డ్యూయెల్ రోల్ చేస్తున్న బాలయ్య ఒకటి పవర్ ఫుల్ గెటప్ రెండోది కాస్త మాస్ గెటప్ లో ఆయన కనిపిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.