Advertisement
Google Ads BL

RC 15 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?


రామ్ చరణ్ - శంకర్ కాంబోలో క్రేజీ మూవీ గా మూడు లాంగ్వేజెస్ లో తెరకెక్కుతున్న RC15 టైటిల్ విషయంలో రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ ఏ ఒక్కదాన్ని కన్ ఫర్మ్ చెయ్యడం లేదు టీం. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అమృత సర్ లో జరుగుతుంది. అక్కడ ఓ సాంగ్ షూటింగ్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు శంకర్ రెండు రోజుల క్రితం రామ్ చరణ్ అక్కడ తన పార్ట్ షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చేసారు. తదుపరి షెడ్యూల్ శంకర్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పుడో డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement
CJ Advs

అది వచ్చే ఏడాది మార్చి 30 న RC15 విడుదల చేస్తే బావుంటుంది అని శంకర్ అండ్ దిల్ రాజులు ఆలోచిస్తున్నారట. అసలైతే 2023 సంక్రాంతి టార్గెట్ తో ఈ మూవీ మొదలైనా.. ఇప్పుడు అదే సంక్రాంతికి దిల్ రాజు మరో మూవీ వారసుడు విడుదలవుతుంది. అందుకే సంక్రాంతి బరి నుండి చరణ్ - శంకర్ లు వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వస్తున్న వేళ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్రచారంలోకి వచ్చింది. మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే. అందుకే మార్చి 30 న RC15 విడుదల తేదీ అయితే బావుంటుంది అని అనుకుంటున్నారట. ఆగష్టు 15 న రామ్ చరణ్ RC15 లుక్ రిలీజ్ చేయబోతున్నారట. అప్పుడు విడుదల తేదీ కూడా అఫీషియల్ గా ప్రకటిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

RC15: Title to be revealed shortly :

RC15: Title to be revealed?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs