Advertisement
Google Ads BL

రామ్ తో మూవీ, హరీష్ శంకర్ క్లారిటీ


రామ్ పోతినేని తన రీసెంట్ మూవీ ద వారియర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ్ లో బైలింగువల్ మూవీగా లింగుసామి తెరకెక్కించిన వారియర్ మూవీ రేపు శుక్రవారమే రిలీజ్ కాబోతుంది. గత వారం తమిళ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ముగించిన టీం నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేస్తుంది. అయితే రామ్ వారియర్ తర్వాత బోయపాటి శ్రీను తో కలిసి పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నారు. బోయపాటి తో రామ్ భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చెయ్యబోతున్నారు. ఈ సినిమా రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అయితే రామ్ తన తదుపరి మూవీ పై కూడా క్లారిటీ ఇచ్చేసారు.

Advertisement
CJ Advs

నిన్నటివరకు రామ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా ఓకె చేసుకున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం చేస్తూ హరీష్ శంకర్.. రామ్ తో మూవీ చేయబోతున్నట్లుగా ద వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు. మరి హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ చెయ్యాల్సి ఉంది. ఆ సినిమా ఆగష్టు నుండి మొదలు కాబోతుంది. ఇక తాజాగా హరీష్, రామ్ ప్రాజెక్ట్ ఓకె అయ్యింది. పవన్ కళ్యాణ్ తో మూవీ అవ్వగానే హరీష్ శంకర్, బోయపాటి తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ముగియగానే రామ్ కలిసి కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడతారేమో. ప్రస్తుతం అయితే రామ్ - హరీష్ శంకర్ మూవీ పై రామ్ ఇచ్చిన క్లారిటీ రామ్ ఫాన్స్ కి కిక్ ఇచ్చింది. 

Harish Shankar confirms he would do a project with Ram Pothineni:

Ram Pothineni To Join Harish Shankar Next Project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs