Advertisement
Google Ads BL

అక్కినేని ఫాన్స్ కి సర్ ప్రైజ్ న్యూస్


హీరో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత మాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. అఖిల్ ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏజెంట్ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఏజెంట్ టీజర్ జులై 15న విడుదల కానుంది. ఈ తేదీ తర్వాత పాన్ ఇండియా అంతాట ఎ.. జెంట్ కోసం ఎదురుచూస్తారు. అఖిల్ ఏజెంట్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్న న్యూస్ చూసి అక్కినేని ఫాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. జూలై 15న ఒక వైల్డ్ స్టైల్ వ్యాపించబోతుంది అని మేకర్స్ ప్రత్యేక వీడియో ద్వారా టీజర్ డేట్ ని ప్రకటించారు.

Advertisement
CJ Advs

హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. స్టయిలిష్‌గా చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్సులు ఏజెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.

Akhil Akkineni Agent To Have Pan India Release:

Akhil Akkineni Agent To Have Pan India Release, Teaser On July 15th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs