Advertisement
Google Ads BL

ఆర్పీ కి కౌంటర్ ఇచ్చిన ఆది, రామ్ ప్రసాద్


కిర్రాక్ ఆర్పీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన కమెడియన్. ఎందుకంటే జబర్దస్త్ తో ఫెమస్ అయ్యి అక్కడినుండి బయటికి వచ్చి అన్నం పెట్టిన సంస్థపైనే నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు ఆర్పీ.. ఇది కామెడీ ఫాన్స్ అంటున్న మాట. జబర్దస్త్ తనకి అన్నం పెట్టింది అన్న ఆర్పీ నే ఇప్పుడు.. మేము కష్టపడితేనే మాకు పారితోషకం ఇచ్చారు, ఊరికినే ఇవ్వలేదు, జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది అంటే ఒప్పుకోను. మల్లెమాల సంస్థ ఫుడ్ విషయంలో మమ్మల్ని చాలా చీప్ గా చూసేది అంటూ ఈమధ్యన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వడానికి హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లు రంగంలోకి దిగారు.

Advertisement
CJ Advs

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది, రామ్ ప్రసాద్ ఆర్పీ చెప్పింది అంతా అబద్దం, మల్లెమాల సంస్థ పై ఆర్పీ చేసిన కామెంట్స్ లో ఒక్కటీ నిజం కాదని అంటున్నారు. గతంలో జబర్దస్త్ నాకు అన్నం పెట్టింది అని ఆర్పీ ఎమోషనల్ అయిన వీడియో ని ప్రూఫ్ గా చూపించారు ఆ ఇంటర్వ్యూలో ఆది, రామ్ ప్రసాద్ లు. అంతేకాకుండా సుధీర్ పై వేసే పంచ్ లు తట్టుకోలేక, అక్కడ తనకి అవమానం జరుగుతుంది అని అతను జబర్దస్త్ నుండి బయటికి వచ్చేశాడంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ కి ఆది, రామ్ ప్రసాద్ లు రష్మీ - సుధీర్ లవ్ ట్రాక్ తోనే హైలెట్ అయ్యారు, సుధీర్ పంచ్ వేసే టైప్ కాదు, ఆయనపై పంచ్ వేస్తె అది వర్కౌట్ అవుతుంది. దానిని సుధీర్ ఎంజాయ్ చేస్తాడు. 

రష్మీ, సుధీర్ తమ జీవితాలను త్యాగం చేసి షో చెయ్యలేదు. వారి లవ్ ట్రాక్ పై ఎవరి బలవంతం లేదు. అదే స్టార్ మా లో సుధీర్ చేసిన హోలీ ప్రొగ్రాంలోనూ రష్మీ తో ట్రాక్ పెట్టారు. అదే వాళ్ళ ని పాపులర్ చేసింది. అది వర్కౌట్ అవుతుంది కాబట్టే డైరెక్టర్స్ అలా చేస్తారు. వారే ఒప్పుకుంటారు. తాము ఎలా ఫెమస్ అయ్యామో అనేది అంటూ ఆర్పీ మల్లెమాల పై చేసిన కామెంట్స్ అన్ని అబద్దాలు అంటూ ఆది, రామ్ ప్రసాద్ లు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 

Aadi, Ram Prasad counter attack to Kiraak RP:

Aadi, Ram Prasad latest interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs