యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు వంక పెట్టడానికి ఎవరూ సరిపోరు. ఆయన కి సరిపోయే కథ ఇచ్చి, దానికి కరెక్ట్ దర్శకుడు దొరికితే ఎలాంటి సినిమాలు వస్తాయో ఆర్ ఆర్ ఆర్ ని చూస్తే తెలుస్తుంది. రాజమౌళితో చేసిన సింహాద్రి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు మాత్రమే కాదు, పూరి టెంపర్, త్రివిక్రమ్ అరవింద సమేత, సుకుమార్ నాన్నకు ప్రేమతో.. ఇలాంటి సినిమాలు ఎన్టీఆర్ లోని నటనని ప్రేక్షకుడు ఫీలవుతాడు. ట్రిపుల్ ఆర్ లో కొమరం భీముడా సాంగ్ చూసాక ఎన్టీఆర్ అంటే మరింత గౌరవం, అభిమానం, ప్రేమ పెరగడం ఖాయం. ఇప్పుడు రాబోయే కొరటాల మూవీ ఎలా ఉన్నా, ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే మూవీపైనే ఎన్టీఆర్ ఫాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు. మాస్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం బయటికి వస్తుంది అని.
కానీ విక్రమ్ మూవీ చూసాక లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడికి తారక్ లాంటి యాక్టర్ కలిస్తే ఆ సినిమా పాన్ ఇండియాలో రచ్చే. లోకేష్ కనగరాజ్ టేకింగ్ కి ఎన్టీఆర్ పెరఫార్మెన్స్ తోడైతే.. బ్లాక్ బస్టర్ పడడం ఖాయం. లోకేష్ కనగరాజ్ హీరోని స్టయిల్ గా చూపిస్తూనే, అందులోని మాస్ ని పరిచయం చేస్తాడు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ తీసే యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయి. విక్రమ్ ని చూసాక అందులో ఫహద్, కమల్ కేరెక్టర్స్ చూసాక లోకేష్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తే చూడాలని ఎన్టీఆర్ ఫాన్స్ కోరుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ తో తారక్ సినిమా చేస్తే ఆ సినిమా రేంజ్, లెవల్ అన్ని మరిపోతాయని వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.