మహేష్ బాబు ఈరోజు శనివారం త్రివిక్రమ్ తో కలిసి చెయ్యబోయే మూవీ ఎప్పుడు మొదలు పెట్టి, ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్ డేట్ ఇచ్చారు. ఆగష్టు నుండి వచ్చే ఏడాది సమ్మర్ కి మహేష్ బాబు SSMB28 కి కేటాయించుకున్నారు. మరి SSMB28 రిలీజ్ అవడమే రాజమౌళి తో మహేష్ బాబు మూవీ సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. మహేష్ బాబు కథ ఫైనల్ కాలేదు అంటూనే ఈ సినిమా నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవల్లో ఫారెస్ట్ బ్యాగ్డ్రాప్ లో డిజైన్ చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. కేవలం ప్రచారమే కాదు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు మహేష్ తో రాజమౌళి చెయ్యబోయే మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండబోతుంది అని చెప్పారు.
అయితే తాజాగా ఈ సినిమా బడ్జెట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం రాజమౌళి ఇంకా స్క్రిప్ట్ రెడీ చెయ్యకపోయినా బడ్జెట్ లెక్కలు వేస్తున్నారని, ఏ స్కేల్లో ఈ మూవీ ఉండాలి, ఏ స్కేల్లో తెరకెక్కితే ఎంత తిరిగి రాబట్టవచ్చు అని, అలాగే ఈ సినిమాని బాహుబలి రెండు పార్టులకి మించి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారని, బాహుబలి, ట్రిపుల్ ఆర్ అంచనాలు మించి ఉండేలా 550 కోట్ల బడ్జెట్ పెట్టేట్టుగా, బాహుబలిని మించిన గ్రాఫిక్స్ తో మరో విజువల్ వండర్ గా ఈ ప్రాజెక్ట్ ని రాజమౌళి రెడీ చేయబోతున్నట్లుగా టాక్.