బంగార్రాజు సక్సెస్ తో నాగార్జున ఎంతో హుషారుగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మధ్యలో ప్రవీణ్ సత్తారు కి నాగార్జున కి మధ్యన అభిప్రాయభేదాలు వలన షూటింగ్ ఆగింది అన్నప్పటికీ.. తర్వాత దుబాయ్ లాంటి కాస్ట్లీ లొకేషన్స్ లో ఘోస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు. అలాగే మధ్యలో హీరోయిన్ కాజల్ తప్పుకోవడం, తర్వాత ఆమె ప్లేస్ లోకి సోనాల్ చౌహన్ రావడం ఇలా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇంతలో ఘోస్ట్ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అంటూ వార్తలు వస్తున్న వేళ ఘోస్ట్ నుండి అప్ డేట్ వచ్చింది.
నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఘోస్ట్ మూవీ ని అక్టోబర్ 5 న దసరా స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అది కూడా కేవలం థియేటర్స్ లోనే విడుదల అంటూ గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. నాగార్జున కల్ట్ క్లాసిక్ మరియు పాత్ బ్రేకింగ్ మూవీ శివ కూడా 1989లో అదే అక్టోబర్ 5 న తేదీన విడుదలైంది. ఇక ఘోస్ట్ యాక్షన్ సీక్వెన్స్ మినహా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది, త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి టీం దిగబోతుంది అని తెలుస్తుంది.